Home  »  Bollywood News  »  ధురంధర్ 2 కి షాక్ ఇచ్చిన AICWA.. శాశ్వతంగా బ్యాన్ తప్పదా! 

Updated : Feb 18, 2026

 

 


-ధురంధర్ 2 కోసం ఇండియా మొత్తం వెయిటింగ్ 
-రంగంలోకి దిగిన AICWA
-సినిమాని నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని వెల్లడి
-శాశ్వతంగా బ్యాన్ తప్పదా!

 


మార్చి 19 కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అందరు టక్కున చెప్పే సమాధానం 'ధురంధర్ పార్ట్ 2'(Dhurandhar 2)రిలీజ్ అని. అంతలా ఇండియన్ మూవీ లవర్స్ ధురంధర్ 2 అప్ డేట్స్ తో సినీ  సహజీవనం చేస్తు ఉన్నారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 కి సంబంధించిన న్యూస్ ఒకటి రీసెంట్ గా బయటకి వచ్చింది. దీంతో సదరు న్యూస్ ప్రమోషన్స్ లేకుండానే వైరల్ గా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

 

మేకర్స్ ధురంధర్ 2(Dhurandhar 2)షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబై లోని బృహన్ముంబై(Bruhan Mumbai)ఏరియాలో జరపాలనే యోచనలో ఉండగా సదరు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వలేదు.ఈ విషయంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ స్పందిస్తు ధురంధర్ 2 కి బృహన్ముంబై లో షూటింగ్ కి అనుమతి నిరాకరించే విషయానికి మా మద్దతు ఉంటుంది. పరిశ్రమలో కొన్ని వేల మంది పని చేస్తున్నారు. టెక్నీషియన్స్, వర్కర్స్ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడకూడదు. మేకర్స్ ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా చట్టానికి అతీతులు కాదని తన లేఖలో పేర్కొంది.


Also read:  45 ఏళ్ళ ప్రేమాభిషేకం.. వీడియో బయటకి వచ్చింది

 
నిజానికి ధురంధర్ పార్ట్ 2 షూటింగ్‌ బృహన్ముంబై లోని ఒక  భవనం టెర్రస్​పై జరిగింది. ఆ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తు సదరు షూటింగ్ కి ముందస్తు అనుమతి తీసుకోలేదు. భద్రత నియమాలు పాటించకపోవడమే కాకుండా షూటింగ్ కోసం ఉపయోగించే జనరేటర్ వ్యాన్లకి  ఉండాల్సిన అధికారిక క్లియరెన్స్ పత్రాలు లేవనేది కార్పొరేషన్ ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ధురంధర్ ని నిర్మిస్తున్న బి 62 స్టూడియోకి    లక్ష జరిమానా విధించడంతో పాటు సదరు నిర్మాణ సంస్థ బృహన్ముంబై లో శాశ్వతంగా  షూటింగ్ జరపకుండా చేయాలనే యోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది.  

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.